Monday, December 14, 2009

మేమింతే...

తెల్లవాడు పోతూ పోతూ
మనని చూసి నవ్విపోయే ఉంటాడు...
రెండు రోజులయినా గడవక ముందే
ముక్కలయిపోయిన మన ఐకమత్యాన్ని చూసి
జాలితో అయినా నవ్విపోయే ఉంటాడు...

అయినా
ఏనాడు కలిసున్నామని ఈనాడు విడిపోతున్నాం.....

తెల్లవాడి ఉక్కుపాదం కింద
మనమంతా కలిసి నలిగిపోతున్నప్పుడా.....
కులమత భేదాల్లేకుండా వాడు
మన మానప్రాణాలని దోచేస్తున్నప్పుడా......
వాడెళ్తూ మనల్ని రెండుగా విడదీసినప్పుడా.....
విచక్షణ లేకుండా మారణహోమపు మంటల్లో
మనల్ని మనమే కాల్చుకుంటున్నప్పుడా.......

ఏనాడు కలిసున్నామని ఈనాడు విడిపోతున్నాం.......
మతం పేరుతో మనిషికి మనిషే
మృత్యువుగా మారినప్పుడా.....

ప్రాంతం పేరుతో పరాయి దేశపు
సైనికుడిలా పగపట్టినప్పుడా.....
కులపు కక్షలతో కంటిమీద
కునుకు లేకుండా కత్తులు దూసుకున్నప్పుడా.....

ఏనాడు కలిసున్నామని ఈనాడు విడీపోతున్నాం....
భారతీయుడినని చెప్పాల్సిన చోట

దక్షిణభారతీయుడినంటున్నాం...
తెలుగువాడినని గర్వంగా చెప్పాల్సినపుడు
తెలంగాణావాదిననో, సీమబిడ్డననో,
కోస్తా పులిననో చెప్పుకుంటున్నాం
ఆ తెల్లోడు మళ్ళీ వచ్చి
మనల్నిబానిస బ్రతుకుల్లోకి నెట్టేదాకా...
వాడి ఉక్కు పాదాల కింద
మనమంతా తేడాలేకుండా నలిగేదాకా....
మరో స్వాతంత్ర్య సమరం దాకా...
మళ్ళీ మనం కలిసే దాకా....
మనం విడిపోయే ఉంటాం,మన అస్తిత్వాన్ని కోల్పోతూనే ఉంటాం...

Wednesday, October 28, 2009

గుర్తుకొస్తున్నావు...!


పలకరించిన ప్రతి మనిషీ
స్నేహితుడు కాలేడు కాబట్టే
ఏర్పడిన ప్రతి స్నేహం ప్రత్యేకం..
ఎదురుపడిన ప్రతీ ఎద స్పందించదనే
ప్రతి స్నేహితుడి ప్రతిగా
ప్రతి గుండెలో ఓ గుడి ఉంటుంది...

అలాగే
నీ చిరునవ్వుని నా మోములో చూడగలిగే
పారదర్శకత కదా మన స్నేహానిది,
మరిదేంటి ఇప్పుడు నా నవ్వుని కూడా
కనపడనీయని కాఠిన్యం ఎక్కడిది...

మొన్నటి దాకా మన మధ్య దూరమెంతున్నా
గుండె చప్పుడుని సందేశాలుగా
పంపించుకునే సాన్నిహిత్యం,
నేడు నీ ముందే నిలుచున్నా
గుర్తుకు రాని స్నేహితుడిగా
అజ్ఞాతంలో కూర్చున్న అనుభవం....
ఒకసారి విడిపోయాక
ఎన్నిసార్లు ఎదురుపడినా
ఆ ఎడబాటులోని తడబాటు మాత్రం పోలేదు.

నిజమే
మనం ఒక్కసారే కలుస్తాం, ఒక్కసారే విడిపోతాం
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది
ఇక ఎప్పటికీ నీకు
పరిచయమున్న పరాయివాడినే నేను..

Wednesday, May 20, 2009

పరిష్కారం!

"Prema ki premey parishkaaram, Maranam kaadu"
cheekatante bhayapade vaadu chaavuki bhayapadakapovatam prema goppatanamaa, leka viluva katta leni premaki praanam to viluva kattatam premikula moorkhatvama.